సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్మిక గర్జన
500 మందితో కార్యక్రమానికి బయలుదేరిన గండ్ర
భూపాలపల్లి టౌన్ (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు(Singareni Workers) హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది గోదావరిఖనికి బయలుదేరగా గండ్ర జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కార్మిక గర్జన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజికేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.