17న సీనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు..

14-10-2026 | 06:53pm

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఈ నెల 17 న సీనియర్ బాలుర కబడ్డీ జట్టు(Kabaddi Team) ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... ఉదయం 10 గంటలకు సీనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 85 కేజీల బరువులోపు ఉండాలని, పదో తరగతి మెమో, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని ఆయన సూచించారు.

అదేవిధంగా పిట్లం లోని శిశుమందిర్ లో ఈనెల 17 నుంచి 18 వరకు గ్రామపంచాయతీ పరిధిలో బాలుర,బాలికల కు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన బాలుర విభాగానికి మొదటి బహుమతి రూ. 20 వేలు,రెండో బహుమతి రూ.10 వేలు బాలికల విభాగానికి మొదటి బహుమతి రూ.5 వేలు, రెండో బహుమతి, ట్రోపీలు అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు..

మరిన్ని వార్తలు