ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక
14-10-2026 | 06:55pm
భీమిని, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) భీమిని మండలంలోని రైతు వేదికలో బుధవారం ప్రజా వేదికను నిర్వహించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపైన, 15వ విడత సామాజిక తనిఖీ నివేదికలతో ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కిషన్, ఏపీడి శ్రీనివాస్, శివరాం, విజిలెన్స్ అధికారి కృష్ణవేణి, ఎంపీడీవో రమేష్, ఎస్ఆర్పి రాజశేఖర్, ఎంపీఓ అక్తర్, ఏపీవో సత్యప్రసాద్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, బిఆర్పీఎస్, VBG RAM G సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.