విద్యార్థులకు యూనిఫామ్, షూస్ ల పంపిణీ

29-09-2026 | 03:30pm

గణపురం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): గొల్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (Parishad Primary School)విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఏకరూప దుస్తులు, షూస్, సాక్సులు, బెల్టులను మంగళవారం పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లబోయిన విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గొల్లపల్లి గ్రామ సర్పంచ్ ఉడిగె అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినీ, విద్యార్థులకు యూనిఫామ్, షూస్, సాక్సులు, బెల్టులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. త్వరలోనే తన సొంత ఖర్చుతో విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌతమి, ఉపాధ్యాయులు శ్రీదేవి, అంగన్‌వాడీ టీచర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు