ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ఖానాపూర్ (విజయక్రాంతి): వైద్యులు ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Nirmal District Collector Bhavesh Mishra) హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో తాగునీటి సౌకర్యాలు, వార్డుల పరిశుభ్రత, ఆహార మెనూ, ఓపి సేవలు, ఫార్మసీ, చిన్నపిల్లల వార్డు, పోస్టుమార్టం గది పరిశీలించారు.
అనంతరం మున్సిపాలిటీ ఆసుపత్రి శాఖల మధ్య సమన్వయం చేసుకొని పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికంగా డాగ్ బైట్ కేసులు ఎన్ని ఉన్నాయో వివరాలు పంపాలని ఆదేశించారు .ఆసుపత్రి అభివృద్ధికి నిధులు 36 లక్షలు ఉన్నప్పటికీ ఖర్చు చేయకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. ఆయన వెంట డిసిహెచ్ కాశీనాథ్, ఆసుపత్రి సూపర్డెంట్ స్వర్ణ రెడ్డి, వంశీ ,తాసిల్దార్ సుజాత రెడ్డి, కమిషనర్ సుందర్ సింగ్, తదితరులు ఉన్నారు.