నవోదయ అభివృద్ధికి పిఎంశ్రీ నిధులు.!

29-09-2026 | 03:12pm

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

నాగర్‌ కర్నూల్ ( విజయక్రాంతి ): వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ అభివృద్ధికి పీఎం శ్రీ పథకం (PM SHRI Scheme)కింద అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్(Collector Hemanth Keshav Patil) సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రిన్సిపల్ బి. పూర్ణిమను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, సంగీతం, కళలు, క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల డిజిటల్ నైపుణ్యాల కోసం పాఠశాలకు 20 కంప్యూటర్లు మంజూరు చేశారు. 11, 12వ తరగతి విద్యార్థులకు ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక బోధనా ప్రణాళిక రూపొందించాలని, పరీక్షల ఫలితాలను విశ్లేషించి ఉత్తీర్ణత శాతం పెంచేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక, ప్రకృతి ప్రదేశాలను విద్యార్థులు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి 6, 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 30 వరకు కొనసాగుతున్న నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. બેઠકలో డీఈఓ ఏ. రమేష్ కుమార్, ప్రిన్సిపల్ బి. పూర్ణిమ, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు