ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

29-09-2026 | 03:15pm

మఠంపల్లి సెప్టెంబర్ 29(విజయ క్రాంతి):ప్రభుత్వ పధకాలను(Government schemes) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శ్రీనివాసులు(RDO Srinivasulu) అన్నారు.మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో మంగళవారం సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూమి డిజిటలైజేషన్ సర్వే గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు,ఎమ్మార్వో హిమబిందు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూముల వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేయడం ద్వారా భూ రికార్డుల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, భూములకు సంబంధించిన వివరాల్లో పారదర్శకత పెంచడంతో పాటు భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన సేవలను వేగంగా అందించేందుకు

ఈ ప్రక్రియ దోహదపడుతుందని, సర్వే సమయంలో రైతులు,భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని కోరారు.అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ప్రాధాన్యతను అధికారులు వివరించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగు,ఉప సర్పంచ్ భూక్యా నాగు నాయక్,ఆర్ఐ జానీ పాషా జీపీఓ అశోక్,పంచాయతీ కార్యదర్శి మట్టయ్య,వార్డు సభ్యులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు