సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి

15-10-2026 | 04:33pm
  1. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై  దృష్టి సారించాలి 
  2. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

గణపురం, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై  దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్  గురువారం గణపురం పోలీస్ స్టేషన్‌తో పాటు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

కార్యాలయాల నిర్వహణ, పరిశుభ్రత, రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, పనితీరును పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణతో పాటు రౌడీ, హిస్టరీషీటర్లపై నిఘా కొనసాగించాలన్నారు.

మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్‌ఐ బోరగల అశోక్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు