నిలకడగా ఎస్సారెస్పీ నీటి మట్టం

16-09-2026 | 12:51am

ఆర్మూర్,(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నిలకడగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriramsagar project) పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1080.60 అడుగులకు 46.65 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టులోకి సుమారు రెండు వేల  క్యూసెక్కుల వరకు వరద వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టు నుంచి 1938 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 150 క్యూసెక్కులు, ఎవాబిరేషన్  502 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231  క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గుత్ప ఎత్తిపోతలకు 405 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 400 క్యూసెక్కులు, లక్మి కాలువకు 250 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు.

మరిన్ని వార్తలు