పంటల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి: అగ్రికల్చర్ ఏవో హరికృష్ణ
16-09-2026 | 12:58am
సిర్గాపూర్(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని పోట్పల్లి గ్రామన్ని మంగళవారం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ(Agriculture AO Harikrishna) రైతుల పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి అక్కడక్కడ కనిపిస్తోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు. శివారులో పత్తి పంటలను పరిశీలించి రైతులకు(Farmers) సూచనలు చేశారు. సమగ్ర యాజమాన్య పద్ధతులతో పురుగులను నివారించాలన్నారు. విత్తన శుద్ధి, కాండానికి మందు పూతతో పాటు అవసరమైతే వేపకషాయం, తయా మెథమిక్స్, డయాఫెన్తోరినన్ను సూచించిన మోతాదులో పిచికారి చేయాలని తెలిపారు.