60 గజాల స్థలాల కోసం 107 రోజులుగా పోరాటం

10-10-2026 | 09:30pm

హిమాయత్‌నగర్‌లో బతుకమ్మ ఆడుతూ మహిళల నిరసన

మొయినాబాద్‌(విజయక్రాంతి): హిమాయత్‌నగర్‌(Himayatnagar) సర్వే నంబర్‌ 151లో 60 గజాల ఇంటి స్థలాల సమస్య పరిష్కరించాలని కోరుతూ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 107వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మహిళలు(Womens) బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు కేటాయించిన స్థలాలపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. హామీలతో కాకుండా, ఆచరణలో సమస్యను పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్‌ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు