కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోసం రైతులు అరిగోస
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
సబ్ స్టేషన్ ముట్టడించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)లో కరెంటు కోసం రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Ex-Minister Koppula Eshwar) అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli district) ఎలిగేడు మండల కేంద్రంలో రైతులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సబ్ స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నాటి కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించామని, అలాగే గృహ అవసరాల కోసం నిరంతరం విద్యుత్ సరఫరా చేసామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కరెంటు కోసం ఆరోగోస పడుతున్నారని, నాణ్యమైన విద్యుత్తు అందించకపోవడం వలన ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నారు.
దీనివల్ల రైతుల బావులలో వేసుకున్న మోటార్లు కూడా కాలిపోతున్నాయి అని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సరిపడా యూరియా సదాపార చేయడం లేదన్నారు, రైతులను అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి, మాజీ అధ్యక్షులు మోహన్ రావు, తిరుపతి రెడ్డి, పోచలు, సత్యం, సందీప్ రావు, సూర శ్యామ్, మో లుగూరి అంజయ్య , దయాకర్, గోపి, రైతులు తదితరులు పాల్గొన్నారు..