దుర్గాదేవి మండపం లో కుంకుమ పూజలు
16-10-2026 | 06:03pm
బెజ్జూర్ అక్టోబర్ 16 (విజయ క్రాంతి ): బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ(Sri Ranganayaka Swamy Temple) ప్రాంగణంలో ని దుర్గామాత మండపంలో కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తంగేడి పల్లి మహేష్ మహిళ భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహించారు. కాగజ్నగర్ వ్యాపారి అర్బుజ్ కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.