ఇందిరమ్మ లబ్దిదారులకు చీరలు పంపిణీ

30-10-2026 | 05:42pm

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు పైడి రాజేశ్వర్ రెడ్డి(Paidi Rajeshwar Reddy ) ఇందిరమ్మ లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... తాను ఇప్పటి వరకు నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు 10 మందికి చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంకా పేదలయిన లబ్దిదారులకు చీరలు పంపిణీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రాజా గోడ్, దేమికలాన్ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు వెంకట్ రెడ్డి, శ్యాంరావ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు