ఈజీఎస్ పనులు పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి

30-10-2026 | 06:42pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 30 (విజయ క్రాంతి):మండలంలోని అక్కంపల్లి గ్రామంలో(Akkampalli Village) గల ప్రాథమిక పాఠశాల(Primary school) మరియు అంగన్వాడీ కేంద్రం,ఈజీఎస్ పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను మండల స్పెషల్ ఆఫీసర్ రాజకుమార్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ...ప్రతి గ్రామంలో ఈజిఎస్ పనులు పనులు చేపట్టి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు.

అక్కంపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కూడా ఆరాధిసి పనులు వేగవంతం చేయాలన్నారు.ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రంలో గల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకా గౌడ్,ఎంపి ఓ ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు