యువత రాజకీయాల్లో ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది

30-10-2026 | 06:40pm
  1. జవహర్ నగర్ యూత్ బిఆర్ఎస్ అధ్యక్షుడుగా పొలాస అశోక్ కుమార్ ఎన్నిక
  2. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

జవహర్ నగర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): యువత రాజకీయాల్లో ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పదంలోకి పయనిస్తుందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Former Minister Chamakura Malla Reddy) పేర్కొన్నారు  జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా పోలాస అశోక్ కుమార్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఆయనకు, ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, యూత్ విభాగాన్ని ముందంజలో ఉంచేందుకు అశోక్ కుమార్ కృషి చేస్తారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువతను ఏకం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పార్టీకి ముఖ్యంగా మల్లారెడ్డికి, జవహర్ నగర్ బిఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు ఆలూరి సంగీత రాజశేఖర్, పల్లపు రవి, బి ఆర్ఎస్ నాయకులు సింగన్న బాలరాజ్ పటేల్, సిద్ధులు యాదవ్, బండి నవీన్, పొలాస సాయి, కృష్ణ యాదవ్, యాకమ్మ మల్లమ్మ, విమల  తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్‌కు పలువురు నాయకులు, శ్రేణులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు