మంథని, ధన్వాడకు గణపతి సచ్చిదానంద స్వామీజీ రాక

30-10-2026 | 06:45pm
  1. నవంబర్ 1న దత్తాత్రేయ స్వామి ఆలయాల సందర్శన
  2. పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం

మంథని, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ(Sri Sri Ganapathy Sachchidananda Swamiji) నవంబర్ 1న మంథని, ధన్వాడ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆహ్వానం మేరకు స్వామీజీ ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా స్వామీజీ పర్యటనకు సంబంధించిన గోడపత్రికను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చొప్పరి సదానందం మాట్లాడుతూ నవంబర్ 1న ఉదయం 9 గంటలకు ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని, మధ్యాహ్నం 2 గంటలకు మంథనిలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని స్వామీజీ సందర్శిస్తారని తెలిపారు. ఆలయాల సందర్శన అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేసి ఆశీర్వచనాలు అందజేస్తారని పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక గురువు దివ్య దర్శనం భక్తులకు మహాభాగ్యం

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ భక్తులకు మార్గదర్శనం చేసే గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య దర్శనం ఈ ప్రాంత ప్రజలకు గొప్ప అవకాశమని చొప్పరి సదానందం అన్నారు. స్వామీజీ పర్యటనను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచులు పెగడ తిరుమల కుమార్, రాపెల్లి రాజయ్య, ఉప సర్పంచ్ సింగనవేన సదయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోల విజయ్‌తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు