సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్దాం...
తాడ్వాయి,అక్టోబర్,28( విజయ క్రాంతి ): ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) ప్రజల్లోకి తీసుకు వెళ్దామని కాంగ్రెస్ పార్టీ తాడువాయి మండల అధ్యక్షులు బండారు సంజీవులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పేద ప్రజలకు అవసరమైన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని,ఈ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,ఉచిత కరెంటు,ఉచిత బస్సు ప్రయాణం,రేషన్ కార్డుల పంపిణీ తదితర ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
అనంతరం ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తాడువాయి, దేమికలాన్ సింగిల్ విండోల అధ్యక్షులు సంతాజి గారి సుధాకర్ రావు,ఏనుగు వెంక రెడ్డి, బ్రహ్మాజీవాడి కి చెందిన ఎం వై ఎఫ్ అధ్యక్షులు ప్రసాద్ లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్లు గైని శివాజీ, షౌకత్ అలీ,అఖిల్ రావు,నాయకులు మహేందర్ రెడ్డి,శ్యామ్ రావు,రామచంద్రం, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం తదితరులు పాల్గొన్నారు.