హెచ్‌ఐవీ నివారణలో యువత పాత్ర కీలకం

06-10-2026 | 06:49pm

భిక్కనూర్, అక్టోబర్‌ 6 (విజయక్రాంతి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణలో యువత పాత్ర కీలకమని భిక్కనూర్ తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) సౌత్‌ క్యాంపస్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. రాజేశ్వరి అన్నారు. మంగళవారం సామాజిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డీఏపీసీయూ కామారెడ్డి జిల్లా సహకారంతో ‘హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణలో యువత పాత్ర’ అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. డా. అంజయ్య, డా. మోహన్‌బాబు పాల్గొన్నారు. యువత శాస్త్రీయ అవగాహనతో హెచ్‌ఐవీపై అపోహలు, వివక్షను తొలగించేందుకు కృషి చేయాలని సూచించారు. పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు రూ.1,000, రూ.500, రూ.250 నగదు బహుమతులు అందజేయనున్నారు.

మరిన్ని వార్తలు