వరికి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయండి
నాగిరెడ్డిపేట్,నవంబర్ 11 (విజయ క్రాంతి):మండలంలోని రాఘవపల్లి గ్రామంలో(Raghavapalli Village) వ్యవసాయ విస్తరణాధికారి (Agricultural Extension Officer) ప్రశాంత్ కుమార్ రైతులతో యాసంగి పంటల ప్రణాళికల గురించి అవగాహన చేసి వివరించడం జరిగింది.
రైతులకు బహుళ పంటలు వేయడం వలన కలిగే లాభాల గురించి వివరిస్తూ తక్కువ నీటితో అధిక పంటలు ఎలా సాగు చేయాలి పెట్టుబడిని తక్కువ చేసి అంతర పంటలు వేయడం వలన కలుపుని ఎలా నివారించవచ్చు అని రైతులకు వివరించడం జరిగింది.వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, సూర్యపువ్వు లాంటి పంటలు వేయాలని,
ఈ పంటలను వెదజల్లడం కాకుండా వరుసలలో వేసుకోవాలని తద్వారా వరుసకి వరసకి మధ్య ఉన్న కాళీ ప్రదేశాలలో అంతర పంటలైన పెసర,మినుము, అలసంద, శెనగ,లాంటి పంటలను అదేవిధంగా గెట్టు( ఒడ్డు) పొడతా కుసుమ పంటను వేయడం వలన కలుపు తగ్గుతుందని,
అదేవిధంగా తక్కువ నేలలో ఎక్కువ పంటలను పండించవచ్చని ఇంటి అవసరాలకు కావలసిన చిరుధాన్యాలను రైతులు పండించడం వలన రైతులు తమకు కావాల్సిన పప్పు దినుసు పంటలను, నూనె గింజల పంటలను తమ అవసరాలకు సొంతగా పండించిన పంటను ఉపయోగించుకోవడం వలన ఆరోగ్యం కూడా బాగుంటాయని రైతులకు వివరించడం జరిగింది.
అదేవిధంగా వానాకాలకు వరి పంట అవశేషాలను కాలబెట్టకుండా నెలలో కలియదున్నడం వలన సేంద్రియ పదార్థం నేలలో అభివృద్ధి చెంది,నేల సారవంతమై పంటల దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుందని రైతులకు చెప్పడం జరిగింది.ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని రైతులు తొందరగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించడం జరిగింది.
ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారానే పీఎం కిసాన్ డబ్బులు పడతాయని , పంటకు అవసరమైన ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ ఖచ్చితం అని రైతులకు చెప్పడం జరిగింది.సొసైటీకి వడ్లు కాంట చేయాలనుకునే ప్రతి ఒక్క రైతు వడ్లను తూర్పారపట్టాలి తూర్పార పట్టిన వడ్లను మాత్రమే కాంటాలు చేయడం జరుగుతుందని రైతులకు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నార్ల గంగమణి మల్లేష్,ఉపసర్పంచ్ చెన్నం సూరయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ మల్లవ్వ,రైతులు లక్ష్మయ్య, బాలయ్య,కిష్టయ్య, సాయిలు,గంగయ్య,సవిత, లక్ష్మీ,అంజవ్వ తదితరులు ఉన్నారు.