జాతీయ సేవా పథకం ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్

13-11-2026 | 06:01pm

ఘట్ కేసర్, నవంబర్ 13 (విజయక్రాంతి) : వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయంలో(Anurag University) నిర్వహిస్తున్న పశ్చిమ మండల జాతీయ సేవా పథకం(National Service Scheme) (ఎన్ఎస్ఎస్) ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్ 2026 మూడవ రోజు విశిష్ట అతిథి గ్రూప్ విశ్రాంత కెప్టెన్ కె. నచికేత వాయుసేన మెడల్ అవార్డు గ్రహీత పాల్గొని స్వచ్ఛంద సేవకులకు స్ఫూర్తిదాయకమైన, విజ్ఞానవంతమైన ప్రత్యేక ఉపన్యాసాన్ని అందించారు.

ఈకార్యక్రమం దేశ సేవలో యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, క్లిష్ట పరిస్థితులను ఆత్మవిశ్వాసం, సంయమనం, సమయస్ఫూర్తి, పరిణతితో ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, బృందస్ఫూర్తి, మానసిక స్థైర్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

వాస్తవ జీవిత అనుభవాలను వివరిస్తూ, పాల్గొన్న విద్యార్థులతో పరస్పర సంభాషణలు జరిపారు. ఆయన ప్రసంగం వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పాల్గొన్న ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.ఈ సందర్భంగా విశిష్ట అతిథిని డాక్టర్ వి. విజయ కుమార్, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆర్. సైదా, క్యాంప్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లేశ్, క్యాంప్ కోఆర్డినేటర్ ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు