పోషణ మాసంపై అవగాహన కార్యక్రమం
గండీడ్ (విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ. సర్పంచ్ గొల్ల సత్తమ్మ సాయిలు, ఉపసర్పంచి ఎం.పారిజాత అధ్యక్షతన మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (సిడిపిఓ)రూప ఆధ్వర్యంలో జరిగిన పోషకాహారం, ఆరోగ్యం, చిన్నారుల ఎదుగుదలపై అవగాహన కల్పించారు. సిడిపిఓ రూప(CDPO Roopa) మాట్లాడుతూ చిన్నారులు,గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, పాలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. చిన్నారులకు సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలను మెరుగుపరచవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ బోయిని రాధికకు శ్రీమంతం నిర్వహించారు కార్యక్రమంలో. అంగన్వాడి సూపర్వైజర్లు.మల్లమ్మ, అలవేల. ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు డాక్టర్ చంద్రశేఖర్,ఎన్ఎం జ్యోతి,ఆశవర్కర్ రామేశ్వరి,గ్రామస్థులు, మహిళలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.