​ఆరెపల్లి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన

16-10-2026 | 12:18pm

ప్రజలకు అంకితం చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు

​నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలం ఆరెపల్లి గ్రామంలో రైతుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతనంగా నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్‌(Electricity Substation) కు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావు(MLA Thota Laxmikantha Rao) శుక్రవారం శంకుస్థాపన చేశారు. ​ఈ  కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు.

​రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్:

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గంలో తక్కువ వోల్టేజ్, విద్యుత్ కోతల సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఈ నూతన సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా ఆరెపల్లి గ్రాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు సాగునీటి అవసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.

​అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:

జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, రోడ్ల అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలోడి సీ సీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఏ ఎం సీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, పి ఏ సీ ఎస్ అధ్యక్షులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ నందాస్ మోహన్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ గరబోయిన చంద్రకళ వెంకటేశం,విధ్యుత్ శాఖ ఎస్ ఈ సళ్యానాయక్,స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, రైతులు ఉత్సాహంగా పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు