చెత్త సేకరణలో బల్దియా నిర్లక్ష్యం
చెత్త కుప్పలో కూర్చుని నిరసన తెలిపిన కౌన్సిలర్
ఇప్పటికైనా అధికారులు మేలుకొనాలని డిమాండ్
కామారెడ్డి, నవంబర్ 4 (విజయక్రాంతి): ఇది డంపింగ్ యార్డ్(Dumping yard) కాదు చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి అధికారులు పట్టించుకోవడం లేదంటూ బుధవారం కామారెడ్డి నడిబొడ్డున ఓ కౌన్సిలర్ చెత్తకుప్పల కూర్చుని నిరసనకు దిగారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని చెత్త కుప్పలు తొలగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ పర్వతాలు పట్టించుకోవడంలేదని, జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్లు స్పందించి ఎక్కడపడితే అక్కడ ఉన్న చెత్తను తొలగించాలని కోరారు.
లేకుంటే మరో రకంగా నిరసన తెలుపాల్సి వస్తుందని కౌన్సిలర్ లక్ష్మీనారాయణ వాపోయారు. గత రెండు నెలలుగా చెబుతున్న ప్రధాన చౌరస్తాలలో చెత్తను తొలగించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన చౌరస్తాల్లో ఉన్న చెత్తను తొలగించి డంపు యార్డుగా మార్చకుండా అధికారులు కృషి చేయాలని కోరారు. కాలాన్ని ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అందుకే ఈ విధంగా నిరసన చేస్తున్నట్లు తెలిపారు.