దివ్యాంగ బాలికకు అండగా కేకే మహేందర్ రెడ్డి
రూ.1.20 లక్షల విలువైన ఎలక్ట్రిక్ వీల్‌చైర్ అందజేత
గంభీరావుపేట నవంబర్ 20 (విజయక్రాంతి): అభాగ్యులకు అండగా నిలుస్తూ దివ్యాంగ బాలికకు తెలంగాణ ఉద్యమ కారుడు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి(KK Mahender Reddy) చేయూతనందించారు. గంభీరావుపేటకు(Gambhiraopeta) చెందిన అక్కపెల్లి రాజు, మంజుల దంపతుల కుమార్తె వర్షశ్రీ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకుల(Congress leaders') దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, వారు కేకే మహేందర్ రెడ్డికి(KK Mahender Reddy) వివరించారు. వెంటనే స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వం ద్వారా సుమారు రూ.1.20 లక్షల విలువైన ఎలక్ట్రిక్ వీల్‌చైర్Electric Wheelchair మంజూరు చేయించారు.
స్థానిక సర్పంచ్ మల్లుగారి పద్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహమ్మద్ హమీద్, పీఏసీఎస్ చైర్మన్ వేశాల వెంకట్, డైరెక్టర్ పెద్దవేని రాజమల్లయ్య, వార్డు సభ్యులు నిశాంత్, అక్కపెల్లి లత నాయకులు బాలయ్య నర్సింలు తదితరులు వర్షశ్రీకి వీల్‌చైర్ అందజేశారు. తమ కుమార్తెకు సహాయం అందించిన కేకే మహేందర్ రెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.