భూభారతి భూ సర్వే ను సద్వినియోగం చేసుకోవాలి
తాడ్వాయి,నవంబర్,13( విజయ క్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి భూ సర్వే ను(Bhu Bharati Land Survey) సద్వినియోగం చేసుకోవాలని తాడువాయి తహసిల్దార్ శ్వేత తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో ఉన్న 602 ఎకరాల భూమిని పూర్తిగా సర్వే చేస్తామని తెలిపారు.
ఎవరైనా న్యాయంగా భూమిలో కబ్జా ఉండి తమకు పట్టాలు రాని యెడల అలాంటివారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామంలో పూర్తిగా విచారించి న్యాయం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొహమ్మద్ తాజోద్దీన్,కామరెడ్డి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రాజేశం, మండల్ సర్వేయర్ మౌనిక,ఆర్ఐ హారిక, కార్యదర్శి సౌమ్య,జిపిఓ నాగరాజు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.