బాలలే రేపటి సమాజ నిర్మాతలు

13-11-2026 | 06:04pm
  1. చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ
  2. ఐపీఎస్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 
  3. ఆటపాటలతో అలరించిన చిన్నారులు

సుల్తానాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి): బాలలే రేపటి సమాజ నిర్మాతలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని  ఇండియన్ పబ్లిక్ పాఠశాల(Indian Public School) చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్వప్న కాలనీలో గల ఇండియన్ పబ్లిక్ పాఠశాల లో  బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతినిపురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, రంగవల్లులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ సందర్భంగా చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. బాలలే దేశానికి విలువైన సంపద అని, నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ, సృజనాత్మకత దాగి ఉంటాయని, వాటిని గుర్తించిప్రోత్సహించినప్పుడే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలు, వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. రంగురంగుల రంగవల్లులు వేస్తూ తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. చిన్నారుల కేరింతలు, ఉత్సాహంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

విద్యార్థుల ఆనందోత్సాహాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత, మేనేజర్ శివ, వ్యాయామఉపాధ్యాయులు సత్యనారాయణ, సతీష్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు