యూనివర్సిటీ జేఏసీ నాయకుల రీలే దీక్ష రెండో వ రోజు
ముకరంపుర, నవంబర్ 13(విజయ క్రాంతి) : శాతవాహన యూనివర్సిటీలోని(Satavahana University) లా మరియు పీజీ కాలేజీలో(Law and PG College) మిగిలిన ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు(Spot Admissions) నిర్వహించి, విద్యార్థులకు(Students') ప్రవేశ అవకాశాలు కల్పించాలని కోరుతూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు లింగంపల్లి మహేష్ మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల సాధారణ అడ్మిషన్ ప్రక్రియలో సీట్లు పొంద లేకపోయిన అనేక మంది విద్యార్థులు లా మరియు పీజీ విద్యను అభ్యసించేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని అలాంటివారికి స్పాట్ నిర్వహించి యూనివర్సిటీలోని లా మరి పీజీ కోర్సులు మిగిలిపోయిన అన్ని సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ లా కాలేజీలో మరియు పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించే విధంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు అకినపల్లి నరేష్, అమ్మ వెంకటేష్, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.