రూ.1.96 కోట్లతో అభివృద్ధి పనులు

13-11-2026 | 06:07pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): కడెం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ, అంగన్వాడీ(Anganwadi), వివో భవనాలు(VO Buildings), వర్క్ షెడ్లు(Work sheds) మరియు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel)  భూమిపూజ నిర్వహించారు. 

ఈ సందర్భంగా న్యూ ధర్మాజీపేట గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.10 లక్షలతో వివో భవనం, ధర్మాజీపేటలో రూ.10 లక్షలతో వివో భవనం నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అలాగే నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మాణానికి, మాసాయిపేట గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.10 లక్షలతో ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కాంపౌండ్ వాల్, రూ.10 లక్షలతో వివో భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

దిల్దార్‌నగర్ గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.10 లక్షల చొప్పున రెండు వివో భవనాలు, రూ.10 లక్షల చొప్పున రెండు వివో వర్క్ షెడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు మహిళా సంఘాలకు అవసరమైన భవన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఆర్టీఏ సభ్యులు మల్లేష్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ రమేష్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జొన్నల చంద్రశేఖర్, డైరెక్టర్ గొల్ల వెంకటేష్, స్థానిక సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు గంగన్న ,సంబంధిత అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీవో, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు