ఆహారపు అలవాట్లు, వ్యాయమంతో మధుమేహానికి అడ్డుకట్ట
జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, (విజయక్రాంతి ): ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు(Eating habits), నిత్యం శారీరక వ్యాయామం(Physical exercise) ద్వారానే మధుమేహాన్ని నియంత్రించ వచ్చని మంచిర్యాల జిల్లా(Mancherial District) శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం(World Diabetes Day) (వరల్డ్ డయాబెటిస్ డే) సందర్భంగా శుక్రవారం ఆర్ కే 8 డిస్పెన్సరిలో నిర్వహించిన మధుమేహ అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై ఆయన మాట్లాడారు.
శ్రీరాంపూర్ ఏరియా మొత్తం 8200 మంది ఉద్యోగుల్లో దాదాపుగా 24 శాతం అనగా 1782 మంది డయాబెటిక్ బారిన పడినట్లు గణంకాలు చెబుతున్నట్లు తెలిపారు. గతంలో 50 ఏళ్లు, ఆపై వయసు వారి నుంచి బీపీ, షుగర్ పదాలు వినిపించేవి కానీ నేడు సరియైన శారీరక శ్రమ లేకపోవటం, గంటల తరబడి మొబైల్ ఫోన్లకు అంటిపెట్టుకుపోవటంతో 30 ఏళ్లు అంతకు తక్కువ వయసు వారు సైతం వాటి బారిన పడుతున్నారంటూ ఆవేధన వ్యక్తంచేశారు.
వైద్యులు రూపొందించిన అవగాహన కరపత్రంలో పేర్కన్న సూచనలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాటించి మధుమేహం నుంచి విముక్తి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా మధుమేహ నివారణకు పాటించాల్సిన ఆహార అలవాట్లు, వ్యాయమ నియమాలపై వైద్యులు రూపొందించిన కరపత్రాన్ని జీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీవై సీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, ఇతర వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.