కూచిపూడి తండాలో అన్నప్రాసన కార్యక్రమం

13-11-2026 | 06:14pm

కోదాడ నవంబర్ 13(విజయక్రాంతి) : కూచిపూడి తండా గ్రామంలోని(Kuchipudi Thanda Village) అంగన్వాడీ కార్యాలయంలో(Anganwadi Office) శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ బాదావత్ శాంతబాయి,  ఉపాధ్యాయురాలు సుజాత,  ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో చిన్నారులకు మొదటిసారిగా అన్నం తినిపించి ఆశీర్వదించారు. చిన్నారుల పౌష్టికాహారం , ఆరోగ్య సంరక్షణపై ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు బాదావత్ శారదా మోహన్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు