ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొందాం..
- జడ్పి సీఈవో చందర్ నాయక్
తాడ్వాయి సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఎలిమినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని జడ్పి సీఈవో చందర్ నాయక్(ZP CEO Chander Naik) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లె గడ్డ తండాలలో ఆయన మంగళవారం జిల్లా ప్రణాళిక అధికారి, మండల ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలినినో ప్రభావంతో తలెత్తుతున్న నీటి ఎద్దడి సమస్యలను ముందస్తు ప్రణాళిక చర్యలతో కొంతవరకు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
వీబి జీ రాంజీ ద్వారా మంజూరైన పనులను త్వరితగతన పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ సోక్ పిక్స్, బోర్వెల్ రీఛార్జ్ ప్యాంట్లు త్వరితగతిన పూర్తి చేయాలని చేయాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ భువన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్, ఎంపీడీవో భరత్ కుమార్, సర్పంచులు సంకు పోచయ్య,రేణుక గణపతి ఏపిఎం తిరుపతి, కార్యదర్శులు సవిత, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.