'హిందీ దివస్' వేడుకలు
నిర్మల్ సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో హిందీ విభాగం ఆధ్వర్యంలో 'హిందీ దివస్' వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా మక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (GJC) ప్రిన్సిపాల్ డాక్టర్ S. భోజరాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ S. భోజరాం మాట్లాడుతూ, భారతదేశంలో హిందీ భాష జాతీయ భాషగా గుర్తింపు పొందడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. పాఠ్యాంశాల్లో బోధించే శబరి, తులసీదాస్ వంటి కవులు అవధి, బ్రజ్ భాషలలో రచనలు చేసినప్పటికీ, అవి కూడా హిందీ మాండలికాలు (బోలీలు) లో భాగమేనని వివరించారు. హిందీ భాషా వికాస యాత్రలో 'ఫోర్ట్ విలియం కాలేజ్' పాత్ర అపారమైనదని, ఖడీ బోలీ కవులు మరియు ఇతర కవుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్
హిందీ విభాగాధిపతి డాక్టర్ D. హేమలత కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు. గంగాధర్ గారు, అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ పి జి రెడ్డి గారు, సుభాష్ గారు, డాక్టర్ రజిత గారు, ఇతర బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.