మండల ఏబీవీపీ నూతన కార్యవర్గం ఎంపిక
29-09-2026 | 04:42pm
శ్రీరంగాపూర్, సెప్టెంబర్29: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)(All India Students' Council) శ్రీరంగాపూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్ మాట్లాడుతూ విద్యా, సామాజిక, జాతీయ అంశాలపై ఏబీవీపీ అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల కన్వీనర్‌గా కే. నందు, కో-కన్వీనర్‌గా మాసూమ్ ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కళ్యాణ్, శివప్రసాద్, అసిఫ్ పాషా, తేజ, అర్జున్ చంద్రలను నియమించారు.