ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకో బ్రిక్స్ తయారు చేయండి..
29-09-2026 | 11:46pm
డీఎల్‌పీఓ
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్(Ellareddy DLPO Surender) అన్నారు. నీరు, భూమి, గాలి కలుషితం కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట పడేయకుండా వాటితో 'ఎకో బ్రిక్స్' తయారు చేయాలని సూచించారు. ఎకో బ్రిక్స్ తయారీ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేసి, ఎకో బ్రిక్స్‌ను వివిధ నిర్మాణాలకు వినియోగించాలని ఆయన కోరారు.తను ఆడుతుపాడుతూ 100 ఎకో బ్రిక్స్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సంతోష్ కుమార్, అజ్ముద్దీన్, వెంకట్ రాములు, శంకర్ నాయక్, సంతోష్ కుమార్తో పాటు తదితర ఉన్నారు.