బాలింత మృతి.. వనపర్తి ప్రజావైద్యశాలలో ఉద్రిక్తత
30-09-2026 | 12:04am
వనపర్తి టౌన్ సెప్టెంబర్ 29: వనపర్తి పట్టణంలోని ప్రజావైద్యశాల హాస్పిటల్(Wanaparthy Public Hospital)లో బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అప్పారాల గ్రామానికి చెందిన భవ్య(24)కు ఆసుపత్రిలో సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డ జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం(బ్లీడింగ్) కావడంతో భవ్య మృతి చెందినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతికి గల కారణాలు, వైద్యుల చికిత్స తీరుపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.