యువత గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
సదాశివపేట సెప్టెంబర్ 29: మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా యువతలో గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి(TGIC Chairman Nirmala Jaggareddy), ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే(World Heart Day) సందర్భంగా మంగళవారం సదాశివపేటలో బాలాజీ హాస్పిటల్స్ సంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్మల జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు సందర్శించి ఆస్పత్రి సేవలను అభినందించారు. శారీరకంగా ఫిట్‌గా కనిపించడం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, కమిషనర్ శివాజీ, వైస్ చైర్మన్ రేణుక, కౌన్సిలర్లు, బాలాజీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ శ్రీధర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.