నేరాల కట్టడికే కార్డన్‌ సెర్చ్‌..

29-09-2026 | 11:51pm

సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్.. 

సూర్యాపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నేరాల కట్టడి కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్(DSP Prasanna Kumar) అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రం 41 వ వార్డ్ అన్నదురై నగర్ లో జిల్లా ఎస్పి కె నరసింహ ఆదేశాల మేరకు రూరల్ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. అలాగే నెంబర్‌ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని 3 ఆటోలు, 48 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్‌చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. యువత గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అమ్మకాలు జరిపినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచిం చారు. గంజాయితో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ద్వారా కలిగే అనర్థాలను వివరించారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవా హనాలపై వెళ్లవద్దని సూచించారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

కార్డన్‌ సెర్చ్‌ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్డెన్‌ సెర్చ్‌లో టూ టౌన్ ఎస్ఐ గోపికృష్ణ, వన్ టౌన్ ఎస్ఐ సందీప్ రెడ్డి,వన్ టౌన్ ఎస్ఐ అజయ్, ట్రాఫిక్ ఎస్ ఐ యాదవేందర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి, ఎస్ఐ రహీం ఏ ఎస్ఐ నరేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు