విబి-జి ఆర్ఏఎంజి పథకంలో మెట్ల కోసం శిక్షణ

06-11-2026 | 07:21pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 6 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాను(District Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు విబి-జి ఆర్ఏఎంజి పథకంలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండల పరిషత్ కార్యాలయం(Nagireddypet Mandal Parishad Office) వద్ద మెట్ల కోసం శిక్షణ నిర్వహించడం జరిగిందనీ ఏపీవో సక్కుబాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మండలంలోని ప్రతి గ్రామంలో కూలీలను సమీకరించడం,కూలీల కొలతల ప్రకారం పని కల్పించడం,కూలీల హాజరు నమోదు చేయడం, జలసిరి పనులు చేపట్టడం గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,ఎంపిఓ ప్రభాకర్ చారి,ఏపీవో సక్కుబాయి, ఫీల్డ్ అసిస్టెంట్లు అంజయ్య, సాయిలు,సిఓ,టిఏలు, మేటీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు