చెకుముకి సైన్స్ సంబరాల విజేతలకు లయన్స్ క్లబ్ బహుమతులు
నేరేడుచర్ల, నవంబర్ 21(విజయ క్రాంతి): నేరేడుచర్ల లయన్స్ క్లబ్(Nereducherla Lions Club) ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌తో పాటు ఆంగ్ల భాషా ప్రావీణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శనివారం బహుమతులు,ప్రశంసాపత్రాలు అందజేశారు.చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్శించర్ల ప్రథమ,పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ద్వితీయ స్థానాలు సాధించాయి.ప్రైవేటు పాఠశాలల విభాగంలో శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ప్రథమ,పినాకిల్ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో బీసీ గురుకుల బాలుర పాఠశాల రామాపురం ప్రథమ,బీసీ గురుకుల బాలికల పాఠశాల ద్వితీయ స్థానాలు సాధించాయి.అలాగే జిల్లా ఆంగ్ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్య పోటీల్లో పెంచికల్ దిన్నె పాఠశాలకు చెందిన పూజిత,శ్రీజ,నాగశ్రీ, పీఎం శ్రీ ఉన్నత పాఠశాల నేరేడుచర్లకు చెందిన అక్షర దీపిక,భవ్యశ్రీ,సోమవారం ఉన్నత పాఠశాలకు చెందిన ప్రజ్ఞ బహుమతులు గెలుచుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు గుండ్రెడ్డి సైదిరెడ్డి,సభ్యులు గుండా సత్యనారాయణ,కొప్పు లక్ష్మీనారాయణ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.