ఆంగ్ల భాషా పోటీల్లో విద్యార్థుల హవా
మహబూబాబాద్ జిల్లా, కురవి: ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం (ELTA) ఆధ్వర్యంలో కురవి మండల స్థాయిలో నిర్వహించిన వివిధ ఆంగ్ల భాషా పోటీల్లో పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు.
స్టూడెంట్ టాక్ (Student Talk) సీనియర్ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ రాజోలుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని గుంటక అక్షయ ప్రథమ స్థానం సాధించగా, జడ్పీహెచ్‌ఎస్ కురవికి చెందిన 9వ తరగతి విద్యార్థిని కె. పౌర్ణమి ద్వితీయ స్థానంలో నిలిచారు. జూనియర్ విభాగంలో రాజోలు పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఎం. లిఖి ఏంజెల్ ప్రథమ స్థానం సాధించగా, కురవి ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి. నాగరాజు ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.
తెలంగాణ ఇంగ్లీష్ ఒలింపియాడ్ (Telangana English Olympiad) సీనియర్ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ గుండ్రాతిమడుగు పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బి. విష్ణు ప్రథమ స్థానం సాధించగా, కురవి ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బి. సాత్విక్ ద్వితీయ స్థానంలో నిలిచారు.
జూనియర్ విభాగంలో రాజోలు పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి జి. జశ్వంత్ రెడ్డి ప్రథమ స్థానం సాధించగా, జడ్పీహెచ్‌ఎస్ నేరడ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి బి. దేవేందర్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
విజేతల వివరాలను ఎల్టా మండల కన్వీనర్ డి. మోహన్, కో-కన్వీనర్ టి. గోపి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కురవి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీధర్, ఎల్టా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామల దేవి, ఆంగ్ల ఉపాధ్యాయులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.