విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

21-11-2026 | 07:18pm

తాడ్వాయి,నవంబర్,21( విజయక్రాంతి): విద్యార్థులు(Students) చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాలను(Technical skills) పెంపొందించుకోవాలని తాడువాయి ఎంఈఓ రామస్వామి తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో శనివారం సోహం ఆర్ ఐ ఏ ఆధ్వర్యంలో ఒకరోజు రోబోటిక్స్ ప్రాక్టికల్ వర్క్ షాప్(Robotics Practical Workshop) నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోహం ఆర్ ఐ ఏ నిర్వహించిన రోబోటిక్స్ ప్రాక్టికల్స్ విజయవంతమయ్యాయన్నారు.ఈ వర్క్ షాప్ ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెరగడానికి దోహదపడ్డాయన్నారు.

హెచ్డిఎఫ్సి బ్యాంకు సహకారంతో ప్రాక్టికల్ రోబోటిక్స్ వర్క్ షాప్ ను  నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని,విద్యార్థులకు రోబోటిక్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, మోటర్లు సర్క్యూట్ బిల్డింగ్ రోబోటిక్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ వర్క్ షాప్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత,సమస్య పరిష్కార నైపుణ్యాలు, సాంకేతిక ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడానికి దోహద పడిందన్నారు.

వర్క్ షాప్ ముగింపు సందర్భంగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమం సోహం అకాడమీ నిర్మించిన సహదేవ్ కోమరగిరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోహం ఆర్ఐఏ ప్రతినిధులు, రోబోటిక్ పాఠశాల ఇన్చార్జి గిరి,శ్వేత, మెంటర్ వంశధర్ రెడ్డి, డిగ్రీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు