బేగంపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

13-11-2026 | 06:16pm

కేంద్రాన్ని ప్రారంభించిన బేగంపేట ఉపసర్పంచ్ సందెల రేణుక కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు

రామగిరి,నవంబర్13(విజయక్రాంతి) : రామగిరి మండలం(Ramagiri Mandal) అధ్యక్షులు తులసి రామ్ గౌడ్, కమాన్ పూర్ మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణారెడ్డి ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతాంగానికి సూచనసన్నధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్న ప్రభుత్వం. సద్వినియోగం చేసుకోవాలని పిలుపు రామగిరి మండలం బేగంపేట గ్రామంలో  ప్రాథమిక సహకార సంఘం(Primary Cooperative Society) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఉప సర్పంచ్ సందెల  రేణుక కుమార్ గ్రామ శాఖ అధ్యక్షులు కల్వల శంకర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కందుకూరి శ్యామ్ వార్డ్ సభ్యులు మాదాసి శ్రీనివాస్ అంకతి కుమార్ అగ్గి సంజీవ్ పిడుగు సతీష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీగల రాయమల్లు శ్రీరాముల కుమార్ ఊదరి కుమార్  బొంతల సదానందం అనవేన రాయమల్లు బరపటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతులు బయట దళారులకు అమ్మి మోసపోకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని వారు సూచించారు. సన్నధాన్యానికి ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ ఇస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  వ్యవసాయ అధికారులు  తో పాటు పలువురు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు