ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
15-10-2026 | 08:13pm
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణానికి చెందిన 31 మంది ఇందిరమ్మ ఇళ్ల(Indiraamma House) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas Reddy) చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.