పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన కమిటీలు పనిచేయాలి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
మునుగోడు, అక్టోబర్ 16 (విజయక్రాంతి):మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన కమిటీలు పనిచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy)సూచించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈ నెల 7న ఆమోదించిన నియామకాల మేరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులకు పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు ఆధ్వర్యంలో చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణతో కలిసి నూతన కమిటీ సభ్యులు శుక్ర వారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలు కప్పి సత్కరించారు.
మండల స్థాయిలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర బాధ్యతలను నాయకులకు అప్పగించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం లక్ష్యంగా కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు సమష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీలు తాటికొండ సైదులు, మందుల బీరప్ప, సెక్రటరీలు సంకు శంకర్ పందుల సంపత్, జక్కల శీను ,నన్నూరి శేఖర్ రెడ్డి,ఆరెళ్ళ సైదులు ఎగ్జిట్ మెంబర్స్ నెంబర్ జాజుల స్వామి,ఆనగంటి కృష్ణ, పాలకూరిమహేష్ ఉన్నారు.