మూడు తండాలకు బీటీ రోడ్లు..
రూ.3.90 కోట్ల నిధులతో పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
నాగల్గిద్ద, నవంబర్ 13 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండల పరిధిలోని మూడు తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం(Construction of BT roads) కోసం రూ.3.90 కోట్ల ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు(ST SDF funds) మంజూరయ్యాయి. ఇరాక్పల్లి హనుమాన్ తండా, ఉమ్ల గ్రామపంచాయతీ పరిధిలోని లక్య తండాకు రూ.1.70 కోట్లు, ఎనక్పల్లి కొండ్య నాయక్ తండాకు రూ.2.20 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తండావాసులు ఎన్నో ఏళ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీఈ సంపత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విట్టల్ రావు పాటిల్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచులు అశోక్ చౌహాన్, హట్టి సింగ్, రతన్ సింగ్, సువాలి బాయి, గోవింద్, సంతప్ప, నాగమ్మ, అనిల్ పాటిల్, ఎంపీటీసీ నర్సప్ప, విట్టల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శరణప్ప, సురేష్, ప్రేమ్ సింగ్, కమల్ సింగ్, నారాయణ జాదవ్, ఎషప్ప పంచాయతీ కార్యదర్శి రాజయ్య స్వామి,భక్తసింగ్,తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.