సీఎంకు చెప్పుకుంటారా... చెప్పుకోండి

26-09-2026 | 09:57pm

నాకు ఏమి భయం లేదు

తాడువాయి ట్రాన్స్కో ఏఈ దురుసు ప్రవర్తన

తాడ్వాయి,(విజయక్రాంతి): మీరు సీఎంకు చెప్పుకుంటారా.. చెప్పుకోండి... నాకు ఏమి భయం లేదు.. ఎవరికి భయపడేది లేదు అంటూ తాడ్వాయి ట్రాన్స్కో ఏఈ కరుణాకర్(Tadvai Transco AE Karunakar) రైతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామ రైతులు శనివారం గ్రామంలోని ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో తలెత్తుతున్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం తాడ్వాయి సబ్ స్టేషన్ కు 20 మంది రైతులు తరలివచ్చారు. ఈ సమస్యతో బాధపడుతున్నామని సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏఈ తో వాగ్వాదం పెట్టుకున్నారు.

ఈ సందర్భంలో ఏఈ కరుణాకర్ రైతుల(Farmers)పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను ఎవరికి భయపడను మీరు ఫోన్ చేస్తే నేను ఫోన్ లేపాలా ఫోన్ లేపను నా ఇష్టం అంటూ రైతులపై దురుసుగా మాట్లాడారు. గ్రామంలో ఒక ట్రాన్స్ఫార్మర్ తో 23 కరెంట్ మోటార్లు నడుస్తున్నాయి. దీంతో అక్కడ లో ఓల్టేజీ  సమస్య ఏర్పడుతుంది.ఈ సమస్యను పరిష్కరించాలని తాము లైన్ మెన్ కు హెల్పర్ లకు చెబితే ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం మరో ట్రాన్స్ఫార్మర్ కావాలని ఇప్పటికే 20 మంది రైతులము డీడీలు కట్టాం.

డీడీలు కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మాకు మరో ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. లో వోల్టేజ్ సమస్య కారణంగా ట్రాన్స్ఫార్మర్ పరిధిలో రోజు ఎనిమిది మోటార్లు మాత్రమే నడిపించుకుంటున్నామని తెలిపారు.మరో రోజు మరో ఎనిమిది మోటార్లు నడుస్తున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం డి ఈ కి ఫోన్ చేసి రైతులు ఏఈకి పోన్ ఇచ్చిన ఫోను లిఫ్ట్ చేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోవోల్టేజి సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు