కరెంట్ సమస్య పట్టొంచుకునే నాథుడే లేడు
20-09-2026 | 08:10pm
సదాశివనగర్, సెప్టెంబర్20 (విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి గ్రామ పరిధిలో గల 33/11 కెవి సబ్ స్టేషన్(KV Substation)లో తరచు సింగల్ ఫేజ్ సప్లైలో సమస్య ఏర్పడుతుంది. టౌన్ ఫిడర్ సప్లయిలో గత మూడు నెలల నుండి కరెంట్ సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే కరెంట్ పోతుంది. విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వర్షం కారణంగా మధ్యాహ్నం నాలుగు గంటల నుండి రాత్రి వరకు కరెంటు రాకపోవడంపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ ముట్టడించారు. లైన్మెన్, హెల్పర్ స్థానికంగా లేకపోవడం వల్లనే తరచు సమస్య వస్తుందని గ్రామస్తులు ఆరోపించారు.