వి.జి.పి.పి.పై అధికారులకు శిక్షణ

26-09-2026 | 09:20pm

నాలుగు మండలాల సర్పంచ్‌లు, అధికారులకు అవగాహన

దోమకొండ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): దోమకొండ మండల(Domakonda Mandal) కేంద్రంలోని రైతువేదికలో(Farmers Platform) వి.బి.జి.ఆర్.ఎం-జి కార్యక్రమంలో భాగంగా *వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్(Vikasit Gram Panchayat Plan) (వి.జి.పి.పి.)*పై శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, అమలు విధానంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.

ఈ శిక్షణా కార్యక్రమానికి దోమకొండ, భిక్కనూర్, బీబీపేట, రాజంపేట మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు(Panchayat Secretaries), వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.వి.జి.పి.పీలో భాగంగా గ్రామస్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించడం, వాటికి ప్రాధాన్యత క్రమం నిర్ణయించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, అభివృద్ధి ప్రణాళికల తయారీ, అమలు విధానాలపై శిక్షణ ఇచ్చారు.

గ్రామాల అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాల్సిన విధానాన్ని అధికారులు వివరించారు.గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు