వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర

10-11-2026 | 08:29pm

అదనపు కలెక్టర్ డా. అశ్విని తనాజీ వాకడే

ముకరంపుర, నవంబర్ 10 (విజయక్రాంతి): వికసిత్ భారత్ లక్ష్యాన్ని2047 నాటికి సాధించడంలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్ డా. అశ్విని తనాజీ వాకడే(Additional Collector Ashwini Tanaji Wakade) పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వాటి నిర్మూలనకు విద్యార్థులంతా నడుం బిగించాలని సూచించారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన యూత్ పార్లమెంట్ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి విద్యార్థులు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతోపాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.2047 వికసిత్ భారత్ సంకల్పంలో భాగస్వాములై బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

మరిన్ని వార్తలు